భువనగిరి కలెక్టరేట్, మార్చి 17 : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. భూదాన్‌పోచంపల్లి మండలంలో 14.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లిలో-10.2, ఆలేరులో-8.4, అడ్డగూడూరు-7.8, ఆత్మకూర్(ఎం), రామన్నపేట, భువనగిరిలో-7.2, వలిగొండలో -6.4, చౌటుప్పల్‌లో-6, యాదగిరిగుట్టలో-5.6, రాజాపేటలో-3.6, గుండాలలో-2.8, బొమ్మలరామారం, బీబీనగర్‌లో-1 మిల్లీ మీటర్ చొప్పున వర్షం కురిసిందని, జిల్లాలో 6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మాడ్గులపల్లి : మండలంలోని ఆగామోత్కూర్ గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు గురై రెండు పాడి గేదెలు మృతిచెందాయి. బాధిత రైతు బ డి సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన గేదెలను పాకలో ఉంచగా గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో ఒక్కసారిగా పిడుగు పశువులపాకలో పడడంతో గేదెలు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. గేదెల విలువ రూ.80వేల వరకు ఉంటుందని ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. గుడిపల్లి ప్ర భుత్వ దవాఖానలోని వేపచెట్టు పై పిడుగు పడింది.