నీలగిరి, జూలై 19 : నల్లగొండ జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐజీ ఉత్తర్వుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత ఎస్ఐలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలను నల్లగొండ జిల్లాకు, నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న మరో ముగ్గురు ఎస్ఐలను, వీఆర్లో ఉన్న మరో ఎస్ఐని బదిలీ చేశారు. కనగల్ ఎస్ఐగా ఉన్న విష్ణుమూర్తిని, గట్టుప్పల్ ఎస్ఐగా ఉన్న వెంకట్రెడ్డిని సీసీఎస్కు, వీఆర్లో ఉన్న సీహెచ్ బాలకృష్ణను డిండి పోలీస్ స్టేషన్కు, డిండి ఎస్ఐ రాజును యాదాద్రి జిల్లాకు, ఇతర జిల్లాల నుండి వచ్చిన కె.రాజీవ్రెడ్డిని కనగల్కు, ఎం.సంజీవరెడ్డిని గట్టుప్పల్కు, నాగేంద్రబాబును నేరేడుగొమ్ముకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.