కనగల్, జనవరి 29 : కనగల్ మండలం నరసింహపురం గ్రామంలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభమైంది. గురువారం మొదటి ట్రైనింగ్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనగల్ ఎంపీడీఓ వేద, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ వినోద్ యాదవ్, డాక్టర్ భువన, డాక్టర్ రాఘవేంద్ర, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నికిత. హార్టికల్చర్ ఆఫీసర్ అనంత్ రెడ్డి, సెరికల్చర్ ఏడీ నర్సిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ జెల్లా పండరీకమ్, పరిసర గ్రామ సర్పంచులు సురేష్, మల్లేశం, రాజేందర్ రెడ్డి, రాజేశ్వరి నరసింహ, రైతులు పాల్గొన్నారు.