నల్లగొండ, డిసెంబర్ 01 : నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దూదిమెట్ల సత్తయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు. నార్కట్‌పల్లి మాజీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Nalgonda : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దూదిమెట్ల సత్తయ్య బీఆర్ఎస్లో చేరిక