రామగిరి, జనవరి 08 : ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని మర్యాన్ కాలేజీ కొట్టాయంలో ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి అర్హులైన వాలంటీర్లను ఎంజీయూలో గురువారం ఎంపిక చేశారు. భాషా పరిజ్ఞానం, సాంస్కృతిక అంశాల్లో ప్రతిభ చూపిన వారిని వాలంటీర్లుగా ఎంపిక చేసినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.అనిత, శ్రీనివాస్, డా.ఆనంద్ మేనేశ్వరి, సత్యవతి, ప్రియాంక చైతన్య సుధా, పుష్పలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్ఎస్ఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పాల్గొన్నారు
పురుషుల విభాగంలో
కె.తరుణ్, యూనివర్సిటీ సైన్స్ కళాశాల మహాత్మా గాంధీ యూనివర్సిటీ
మహిళా విభాగంలో
ఎన్.అహల్య టీజీఎస్డబ్ల్యూ ఆర్డీసీ సూర్యాపేట.

Ramagiri : జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక