హాలియా, జూన్ 06 : ఎమ్మార్పీ ధరలకే డీలర్లు విత్తనాలు, ఎరువులు విక్రయించాలని టాస్క్ఫోర్స్ అధికారి ఎం.లక్ష్మి అన్నారు. లేనియెడల విత్తన యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. శుక్రవారం అనుముల మండలం హాలియాలోని పలు విత్తన దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు దుకాణాల్లో విత్తన స్టాక్, స్టాక్ రిజిస్టర్, బిల్బుక్స్, ఇన్వాయిస్, కంపెనీ సెక్యూర్ ఆఫ్ సప్లయ్ సర్టిఫికేట్, లైసెన్స్, స్టాక్బోర్డు, ధరల పట్టిన మొదలగు అంశాలను పరిశీలించారు. ఆయా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని విత్తన డీలర్లుకు ఆమె సూచించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి సరిత ఉన్నారు.
Haliya : ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు విక్రయించాలి : ఎం.లక్ష్మి