సూర్యాపేట టౌన్, నవంబర్ 11 : దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది మంగళవారం సూర్యాపేట పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాల్లో విసృత తనిఖీలు చేపట్టింది. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నివారణ కోసం విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులకు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దని నిర్వాహకులకు సూచించారు.

Suryapet Town : సూర్యాపేటలో భద్రాతా సిబ్బంది విస్తృత తనిఖీలు