సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 30 : మే 3న సూర్యాపేట జిల్లా పరిధిలో నిర్వహించే నీట్ (యుజి) -2026 పరీక్ష కేంద్రాల వద్ద మధ్యా హ్నం 12 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు నిషేధ ఆజ్ఞలు సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందుకు వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిదంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల- సూర్యాపేట టౌన్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ &జూ.కాలేజీ, దురాజుపల్లి, చివ్వెంల, ప్రభుత్వ మోడల్ పాఠశాల, ఇమాంపేట, సూర్యాపేట రూరల్ ,తెలంగాణ సోషల్ వెలిఫర్ రెసిడెన్షియల్ గల స్కూల్ & జూ.కాలేజి, ఇమాంపేట, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ & జూ.కాలేజీ, ఫైర్ స్టేషన్ వద్ద, సూర్యాపేట టౌన్ వద్ద ఏర్పాటు చేసినట్లు వివరించారు.