సూర్యాపేట, మార్చి 11 : రాష్ట్రంలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పనితీరు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వీస్, అట్రాసిటీస్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో ఏ జిల్లా కూడా ఎస్సీ ఎస్టీలకు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాఖల వారిగా కమిషన్ చైర్మన్ కు పీపీటీ ద్వారా వివరించలేదని తెలిపారు. జిల్లాలో కలెక్టర్ పనితీరును చైర్మన్ కొనియాడారు. సమావేశ అనంతరం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కే.నీలాదేవి, లక్ష్మీనారాయణ కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.