తుంగతుర్తి, జనవరి 03 : దేశంలో మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య కొనియాడారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన ధీర వనిత ఆమె అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు గోపగాని రమేశ్, ఉప్పుల నాగమల్లు, బొంకూరి మల్లేశ్, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, బొజ్జ సాయికిరణ్, మల్లికార్జున్, బొంకూరి సాయి, అన్నేబోయిన సురేశ్, అశోక్ పాల్గొన్నారు.