తుంగతుర్తి, మార్చి 10 : సమాజంలోని అన్ని వర్గాల మహిళలు విద్యనభ్యసించాలనే తలంపుతో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాదిద్ధామని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సావిత్రిబాయి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలె త్యాగాలను భవిష్యత్ తరాలకు అందచేయాల్సిన బాధ్యత మనందరి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు నరేశ్నాయక్, మాన్సింగ్ నాయక్, యాకూనాయక్, గోపగాని శ్రీనివాస్, గోపగాని రమేశ్, మల్లేశ్, సాయి కిరణ్, వెంకటేశ్, నాగమల్లు, గోపగాని వెంకన్న, కడారి దాసు పాల్గొన్నారు.