యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పూజా సామగ్రిని దేవస్థానం అందజేస్తుందన్నారు.
పూజలో పాల్గొనే భక్తులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కొండపైన గల శాశ్వత పూజలు, అన్నదాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.