పెన్పహాడ్, జనవరి 28 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో గల సమ్మక్క- సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగే సమయంలోనే ఇక్కడా జాతర జరుపుకుంటారు. ఈ జాతరకు చుట్టుపక్కల మండలాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు తలపై అమ్మవారి బోనాలు, నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో వచ్చి అమ్మవార్ల గద్దెల వద్ద సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ నాతల వెంకట్ పాల్గొన్నారు.

Penpahad : గాజుల మల్కాపురంలో సమ్మక్క- సారక్క జాతర ప్రారంభం

Penpahad : గాజుల మల్కాపురంలో సమ్మక్క- సారక్క జాతర ప్రారంభం