పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతన పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్పీలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ, కోదాడ, హుజూర్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి సీఎం ఫ్లెకీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
హుజూర్నగర్ , సెప్టెంబర్ 28 : వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్పీల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని, దేశంలో ఆయనను మించిన మానవతావాది ఎవరూ లేరని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, కౌన్సిలర్ గురువయ్య, బీఆర్ఎస్కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, ఆర్పీలు హేమాలత, శ్రీదేవి, దుర్గాభవానీ, ఝాన్సీ, ఆదిలక్ష్మి, స్పందన పాల్గొన్నారు.
మనదగ్గరే శ్రమకు తగిన వేతనాలు : ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ : మెప్మాలో పని చేస్తున్న ఆర్పీల గౌరవ వేతనం రూ.4 వేల నుంచి 6 వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆర్పీలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిపి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల శ్రమకు తగిన వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఆర్పీలు కెజ్జమ్మ, గిరిజ, నాగమణి, అరుణ, రాణి, అఖిల, సాయమ్మ, జయలక్ష్మి, సుష్మ, సునీత, సైదమ్మ, సుహాసిని, రాణి, అనసూర్య, మాణిక్యం, మధురిమ, అర్చన, బీఆర్ఎస్కేవీ నాయకుడు గురూజీ, నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నీలగిరి : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మెప్మా ఆర్పీలతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. స్వరాష్ట్రంలో ఆశలు, అంగన్వాడీలు, మెప్మా ఆర్పీలకు తగిన ప్రాధాన్యతం ఇచ్చినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్‌యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తీగల జాన్శాస్త్రి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, మహ్మద్ సమీ, జమాల్‌ఖాద్రి, మాజీ కౌన్సిలర్ దండెంపల్లి సత్తయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షడు దేప వెంకట్‌రెడ్డి, ఆర్పీలు పాల్గొన్నారు.