రామగిరి, జూలై 9 : కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9 న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో స్వచ్చందగా అన్ని వర్గాల వారు పాల్గొన్ని విజయవంతం చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడవ పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ కార్మికులు ఎన్నో పోరాటాలతో సాధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిరని విమర్శించారు. ప్రైవేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అందుకే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు లెనిన్, మదార్, ప్రద్యుమ్నారెడ్డి, గుండె రవి తదితరులు పాల్గొన్నారు.