108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గుర్రంపోడు, మార్చి 31 : ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో నల్లగొండకు బయల్దేరగా మార్గమధ్యంలో అష్మితకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గిరి, పైలట్ వెంకట్ సహాయంతో అంబులెన్స్‌లోనే డెలివరీ కిట్ ఉపయోగించి ప్రసవం చేశారు. అనంతరం నవజాత శిశువుకు తగిన పరిచర్యలు చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ సురక్షితంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి ఆస్పత్రి వైద్యులు, అష్మిత కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

