కాంగ్రెస్‌పై కర్షకుల కన్నెర్ర
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
- రెండోరోజూ ఆందోళనలు చేసిన అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు
- కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని శపథంబూనారు.
మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 27: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న కహానీలు నమ్మొద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓటర్లకు సూచించారు. మండలంలో రెండో రోజూ శుక్రవారం ఆయన ప్రగతిబాటను బాదలాపురం నుంచి ప్రారంభించారు. అవంతీపురం, యాద్గార్పల్లి, కాల్వపల్లి , ఊట్లపల్లి , తక్కెళ్లపహాడ్, తడకమళ్ల, దొండవారిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రా్రష్ట్రంలో వెలుగులు విరజిమ్మాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం అంధకారంలో మగ్గిందని గుర్తుకు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో విద్యుత్ సమస్యను పరిష్కరించడంతో రాష్ట్రం వెలుగుమయంగా మారిందని చెప్పారు. అనంతగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ
నాడు కరువుతో విలవిల్లాడిన తెలంగాణ.. నేడు అన్నపూర్ణగా ఎదిగి దేశానికే అన్నం పెడుతున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్తును అందించడంతో లక్షల ఎకరాల్లో వరి సాగువుతోందన్నారు. దీంతో రాష్ట్రం వరి సాగులో రికార్డు స్థాయి లో దూసుకెళ్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలను ఇంటింటికి తీసుకెళ్లి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు.
ఈకార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, వైస్ ఎం పీపీ అమరావతలి సైదులు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదు లు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఇర్కె ప్రసాద్, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, పీఏసీఎస్ చైర్మన్లు పాదురు సంజీవరెడ్డి, రామకృష్ణ, సర్పంచ్‌లు దుండిగాల యాదమ్మ శ్రీనివాస్, మందుగుల వెం కన్న, దొండ రామరాజు, అలెగ్జండర్, చౌగిన బిక్షం గౌడ్, మేలచిన వెంకులు, ఎంపీటీసీలు తలకొప్పుల సైదు లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

