తుంగతుర్తి, ఏప్రిల్ 03 : రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ మార్చి 31 నాటికి రైతు భరోసా అందిస్తామని హామీఇచ్చి దాటవేసినట్లు దుయ్యబట్టారు. గురువారం మండంలోని సంగేమ్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి, పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
అధికారం కోసం కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అసెంబ్లీలో నిలదీస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాల నుండి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందన్నారు. ఇలాంటి అబద్దాల ప్రభుత్వానికి రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు కడారి దాసు, మట్టిపల్లి వెంకట్, మల్యాల రాములు, గ్రామ అధ్యక్షులు జటంగి రవి, బొల్లెడ్డు శ్రవణ్, కలకోట్ల ఎలైజర్, మల్యాల వెంకన్న, రమేశ్, మల్లయ్య పాల్గొన్నారు.