కట్టంగూర్, జూన్ 18 : కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని నాగరాజు అన్నారు. రోడ్ల మరమ్మతులతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని తూర్పాయిగూడెం, ఎరసానిగూడెం, పరడ, తొట్లవారిగూడెం, చెర్వుఅన్నారం, కురుమర్తి, అక్కలాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీగా మార్చాలన్నారు.
చెర్వుఅన్నారం క్రాస్‌రోడ్ వద్ద రాత్రి సమయంలో చీకటి ఉండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంతంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. కట్టంగూర్ బస్టాండ్ నుంచి కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వినతి ప్రతం అందజేసిన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు నీలం నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, నాయకులు బసవోజు వినోద్, చొక్కాల చరణ్, కాడింగ్ శ్రవణ్, కొరివి నాగరాజు, చందు, పులకరం గోపి ఉన్నారు.