చివ్వెంల, ఏప్రిల్ 26 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఉమా మహేశ్వర స్వామికి చైత్రమాస శివరాత్రి సందర్భంగా శనివారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మంత్రమూర్తి మనోహరశర్మగారి ఆధ్వర్యంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.