నల్లగొండ సిటీ జనవరి 19 : సంక్రాంతి పండుగ ముగిసినా ఆర్టీసీ టికెట్లపై అదనపు బాదుడు తగ్గలేదు. పండుగ సందర్భంగా అదనపు బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల నుంచి టికెట్‌పై 50 శాతం చార్జీలను పెంచింది. అదే దోపిడీ పండుగ ముగిసినా కొనసాగిస్తుండడంతో ఆదివారం నల్లగొండ బస్టాండ్‌లో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ అధికారులపై ఘర్షణకు దిగారు. సాధారణ రోజుల్లో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్‌లో రూ.180 ఉండగా పండగ సందర్భంగా రూ. 250 వసూలు చేశారు. ఈ నెల 18 వరకు మాత్రమే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయాలని. కానీ పండుగ ముగిసినా అవే చార్జీలు వసూలు చేస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు చార్జీలను తగ్గించడం లేదని తెలుస్తున్నది. దీనిపై కొందరు ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తుండగా, గత్యంతరం లేక మరికొందరు అవే బస్సుల్లో వెళ్తున్న పరిస్థితి కనిపించింది.