నల్లగొండ సిటీ, జూన్ 24 : ఆర్టీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్‌గా ఎం.రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఎస్.శ్రీదేవి సీటీఎంగా బస్ భవన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో బస్ భవన్లో పనిచేస్తున్న రాజశేఖర్‌ను ఉమ్మడి నల్లగొండ ఆర్ఎంగా బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన ఆర్ఎం రాజశేఖర్‌కు డీవీఎంలు శివశంకర్, మాధవి, డీఎం రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది
శుభాకాంక్షలు తెలిపారు.