మాల్, జూన్ 16 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ బాబాని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచిగంటి ధనంజయ, కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు ఆహ్వానం పలికి వేద ఆశీర్వచనం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకటరెడ్డి, అండెకార్ అశోక్, కొమిరిశెట్టి వెంకటయ్య, ఊరే కృష్ణయ్య, కుంభ పుల్లారెడ్డి, తడకమల్ల శ్రీను, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.