భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: రైతులకు శా పంగా మారిన త్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మా ర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట శనివారం మహాధర్నా నిర్వ హించి మాట్లాడారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా దానిని 28 కిలోమీటర్లు కుదించడం వల్ల పట్టణ, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న సారవంతమైన వరి, పత్తి పండే భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. సేద్యాకి యోగ్యం కానీ భూములను తీసుకోవాల ని చట్టం చెబుతున్నా కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మార్చి అన్నదాతలకు నష్టం కలిగించాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వందల కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో త్రిపుల్ ఆర్ సమస్యను వాడుకొని అధికారంలోకి రాగానే అలైన్ మెంట్ మార్చుతామని హామీఇచ్చి ఇప్పుడు హామీ ని మర్చిపోయి రైతులకు మొండిచేయి చూపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యు డు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ గతం లో ఉన్న అలైన్‌మెంట్‌ను కాకుండా రైతుల పొట్ట కొట్టే విధంగా కొత్త అలైన్‌మెంట్‌ను తీసుకొచ్చి కేవలం పేద, మధ్యతరగతి రైతుల భూము లను మాత్రమే తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఉన్న తస్థాయిలో రైతులతో సమీక్షించాలని, రైతుల గోస వినాలన్నారు. ఈ డిమాండ్‌పై అక్టోబర్ 6న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో బట్టుపల్లి అనురాధ, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నడికుడి అంజయ్య, దొం తగాని పెద్దులు, గంగదేవి సైదులు, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేశ్, పల్లెర్ల అం జయ్య, ఈర్లపల్లి ముత్యాలు, గంటపాక శివ తదితరులు పాల్గొన్నారు.
బలవంతంగా భూములు లాకోవద్దు
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూము లు లాకోవద్దని, వారిని తగిన విధంగా ఆదుకోవాలని లేకపోతే అక్టోబర్ 6న సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రీజినల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవారు, పలుకుబడి కలిగిన వారు, పెత్తందారుల భూముల జోలికి వెళ్లకుండా నిరుపేదల భూము ల్లో త్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్లేలా అలైన్‌మెంట్‌ను మార్చారని విమర్శించారు. దీంతో పేద రైతులు భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. రైతులతో మాట్లాడకుండా, నోటీసులు ఇవ్వకుండా సర్వే నెంబర్లను బ్లాక్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
దీనికి తోడు ఆర్ఆర్ఆర్తోపాటు దానిచుట్టూ రింగ్ రైలు, మెక్కలు నాటడానికి అదనంగా మరో 40 వేల నుంచి 45 వేల ఎకరాల భూమి అవసరమని అంచనాలు వేసినట్లు తెలిపారు. దీంతో వేల మంది రైతులు నిర్వాసితులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరైంది కాదన్నారు. ఎకరా రెండు నుంచి ఐదు కోట్లు ఉం టే ప్రభుత్వం కేవలం రూ.20లక్షలు ఇస్తామనటం అన్యాయమన్నారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, మహేశ్, కొండ అనురాధ, ఉడుగుండ్ల రాములు, యాదయ్య, సాగర్ల మల్లేశ్, సత్యనారాయణ, ప్రమీలారామలింగా చారి పాల్గొన్నారు.