బొడ్రాయిబజార్, జూలై 13 : జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై హెడ్ పోస్టాఫీసు ప్రాంతంలోని రాయల్ ఫుడ్ కోర్టు పరిసరాలు, లోపల అపరిశుభ్రంగా ఉండడంతో యజమాని జానీపాషాకు మున్సిపల్ కమిషనర్ రూ.5వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో హోటల్ యాజమాన్యం, పెట్టి వెండర్స్ తమ పరిసరాలను, కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
నిల్వ ఉంచిన, పాడైపోయిన పదార్థాలను వాడితే హోటళ్లను సీజ్ చేసి, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, బూర సతీశ్, హెల్త్ అసిస్టెంట్ మస్కాపురం సురేశ్, జవాన్లు మొల్కలపల్లి పరశురాములు,
పిడమర్తి ప్రసాద్, దండు ఉపేందర్, జి.మల్లేశ్ ఉన్నారు.