కోదాడ, జూలై 06 : దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆ కళాశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.. ఈ సందర్భంగా బహుమతి ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం సాంకేతికతను ఉపయోగించుకుని గ్రామాల అభివృద్ధి చేయాలని సూచించారు. మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాలని అక్షరాస్యతపై సామాజిక రుగ్మతలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
జిల్లా మై భారత్ కేంద్రం నిర్వాహకుడు ఎం కె నాయక్ మాట్లాడుతూ.. యువత మై భారత్ పోర్టల్ లో రిజిస్టర్ కావాలని, భారత ప్రభుత్వం యువత విద్యార్థుల కోసం నిర్వహించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. స్వయం ఉపాధి కార్యకలాపాలతో ఆర్థిక పరిపుష్టి పెంపొందించుకోవాలన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అధ్యాపకులు పిచ్చిరెడ్డి యాదగిరి, బల భీమారావు, రమేష్, రామరాజు, రవి కిరణ్, సతీష్, నాగరాజు, తిరుమల, నరసింహారెడ్డి, జ్యోతిలక్ష్మి, మమతా, విద్యార్థులు పాల్గొన్నారు.