కట్టంగూర్, జనవరి 29 : గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు అన్నారు. నూతనంగా ఎన్నికైన మండల సర్పంచులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సన్మానం పొందిన సర్పంచులు మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి అంకిభావంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునుగోటి రవీందర్, ఎంపీఓ స్వరూపారాణి, సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు జమీల్, నవీన్, ఆర్ఐ రామారావు, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం రాములు, సర్పంచులు ముక్కాముల శ్యామల, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వడ్డె మాధవిసైదిరెడ్డి, ధార సత్తెమ్మ, తేలు సత్తయ్య, కొలిపాక సురేందర్, బెల్లి సుధాకర్, వల్లపు వెంకటనారాయణరెడ్డి, జలేంద్ర, మాద మమత, ఎన్న మౌనిక, కడారి సంధ్య, పొన్నబోయిన సత్యనారాయణ, కొవ్వాకుల రాంబాబు, చిలుముల సైదులు, ఆకిటి శంకర్, విప్పలపల్లి అనిత, పెద్ది నాగమణి పాల్గొన్నారు.