భువనగిరి అర్బన్, అక్టోబర్ 27: రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ధాన్యం, పత్తి కొనుగోలు, కేంద్రాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, అలాగే 90 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అం చనా వేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలన్నారు. రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేం ద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండటానికి వీలులేదన్నారు. ధాన్యం వచ్చిన వెంటనే రెండు పూటలా లోడింగ్ చేసి ఎప్పుడొచ్చిన ధాన్యాన్ని అప్పుడే పంపాలన్నారు.
రైతులు టార్పాలిన్ కవర్లను అం దుబాటులో ఉంచుకోవాలన్నారు. మిల్లర్లు ధాన్యం సేకరణ విషయం లో ఇబ్బందులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల య్య, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, ఏసీపీ రాహుల్‌రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సైప్లె జిల్లా మేనేజర్ హరికృష్ణ, సివిల్ సైప్లె జిల్లా అధికారి రాజారాణి, వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.