భువనగిరి అర్బన్, డిసెంబర్ 25 : దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో బుధవారం జరిగింది. హైదరాబాద్లోని రామంతాపూర్లోని పలు కాలనీలకు చెందిన శ్రీను, అర్జున్, మితిన్ రామంతాపూర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మణిజయంత్, యశ్వంత్ నారాయణగూడలోని నారాయ ణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
కాగా, బుదవారం క్రిస్మస్ సెలవు కావడంతో యాదగిరిగుట్టకు వెళ్లాలనుకున్నారు. అదే కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ సుఫ్యాన్ ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని యాదగిరిగుట్టకు దైవదర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఓ హోటల్లో టిఫిన్ చేశారు. అనంతరం భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నారు. ఈ క్రమం లో భువనగిరి పట్టణ పరిధిలోని బొమ్మాయిపల్లి చౌరస్తా సమీపంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ సుఫ్యాన్(25), యశ్వంత్(17) అక్కడికక్కడే మృ తిచెందారు. కారులో ఉన్న అర్జున్, నితిన్, శ్రీను, మణిజయంత్, కారు డ్రైవర్ వెంట వచ్చిన 9వ తరగతి విద్యార్థి షాకిబ్కు తీవ్రగాయాలయ్యా యి. స్థానికుల సమాచారంతో పోలీసులు సం ఘటన స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలైన వారిని 108 వాహనంలో భునవగిరి ఏరియా దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.