వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై మంగళవారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లి గాంధీనగర్‌కు చెందిన బత్తుల ధనుంజయరావు(42) ఉప్పుతల నర్సింహారావు (38) కలసి బైక్‌పై దక్కన్ సిమెంటు ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండగా నార్కట్‌పల్లి అద్దంకి హైవేపై ఉన్న లారీయార్డు సమీపంలో ఏపీలోని దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన డెక్క వెంకటేశ్(25) మోటార్ సైకిల్‌పై ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొనడంతో ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
- రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి
దామరచర్ల, జూన్ 9 : ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై మంగళవారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లి గాంధీనగర్‌కు చెందిన బత్తుల ధనుంజయరావు(42) ఉప్పుతల నర్సింహారావు (38) కలసి బైక్‌పై దక్కన్ సిమెంటు ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండగా నార్కట్‌పల్లి అద్దంకి హైవేపై ఉన్న లారీయార్డు సమీపంలో ఏపీలోని దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన డెక్క వెంకటేశ్(25) మోటార్ సైకిల్‌పై ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొనడంతో ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహారావు, వెంకటేశ్‌ను 108లో మిర్యాలగూడ దవాఖానకు తరలించారు.
వెంకటేశ్ చికత్స పొందుతూ మృతి చెందగా నర్సింహారావును మెరుగైన చికిత్స కొసం నల్లగొండకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ధనుంజయరావుకు భార్య, ఇద్దరు పిల్లలు, నర్సింహారావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. వాడపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో గ్రామం లో విషాదం అలుముకుంది. సమాచారం తెలుసుకున్న వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో వచ్చి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

