త్రిపురారం, జూన్ 04 : వానాకాలంలో రైతులు పండించుకోవడానికి త్రిపురారం మండలంలోని కంపసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పరిశోధన స్థానం హెడ్ ఎన్.లింగయ్య బుధవారం తెలిపారు. బీపీటీ-5204(సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048(తెలంగాణ సోనా), కేపీఎస్-6251 అనే సన్నగింజలు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కొనుగోలు చేసే రైతులు 20 కేజీల బస్తా రూ.1,060 చెల్లించి కొనుగోలు చేయొచ్చన్నారు. మరిన్ని వివరాలకు శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ 9640370666 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.