కట్టంగూర్, నవంబర్ 25 : రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పెంచి ధానాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు కేటాయించి ధాన్యం టార్గెట్ పూర్తయిందని రైస్ మిల్లుల యాజమాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం బుధవారం జరగనున్న దేశవ్యాప్త సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘః మండల కార్యదర్శి పింజర్ల సైదులు, చెరుకు జానకి, ఊటూరి శ్రీకాంత్, చిలుకూరి ప్రమీల, గాదగోని లింగస్వామి, జ్యోతి, నాగమ్మ, అరుణ, యాదగిరి పాల్గొన్నారు.