నల్లగొండ రూరల్, జూన్ 03 : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, ఈ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. రెవెన్యూ సదస్సులో భాగంగా నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మండలంలోని అప్పాజీపేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భూ సమస్యల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో తాసిల్దార్ హరిబాబు, ఆర్ఐ గౌస్ అలీ, ఏఆర్ఐ, వీఆర్ఏలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Nalgonda Rural : భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు : అదనపు కలెక్టర్ శ్రీనివాస్