కట్టంగూర్, జూన్ 05 : భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని డిప్యూటీ తాసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బట్ అన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గురువారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి, ఇస్మాయిల్పల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భూ సమస్యలపై రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. వందనపల్లి గ్రామంలో 73, ఇస్మాయిల్పల్లి గ్రామంలో 59 మంది రైతుల నుంచి దరఖాసులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ కుమార్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ప్రియదర్శిని, శ్రీనివాస్, రవి, బాలరాజు, భాగ్యలక్ష్మి, రఘు, సంతోష, స్వామి, అరవింద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.