‘విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి కొడారి రాణి విశేష సేవలు’
ప్రతి ఉద్యోగుకీ పదవీ విరమణ తప్పనిసరి అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కొడారి రాణి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం మంగళవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
– పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్
కట్టంగూర్, మార్చి 31 : ప్రతి ఉద్యోగుకీ పదవీ విరమణ తప్పనిసరి అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కొడారి రాణి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం మంగళవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. కొడారి రాణి 30 సంవత్సరాల విద్యారంగానికి సేవలు అందించారని తెలిపారు. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆమె బోధనలో నైపుణ్యం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. పాఠశాలలో విద్యా ప్రయాణాలను పెంచడంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మావతి, పీఆర్ టీయూ మండల అధ్యక్ష. ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి వెంకటరమణ, చింతకాయల పుల్లయ్య, మాజీ అధ్యక్షులు నీలా కలనకయ్య, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షులు చిన్ని శ్రీనివాస్, ఉపాధ్యాయులు విఠల్ కుమార్, నమ్మెటీ తిరుమలేష్, మహాలక్ష్మి, రామచంద్రయ్య, అంతోని, షరీఫ్, వార్డు సభ్యురాలు అయితగోని సైదమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Kattangur
- Nalgonda News
- prtu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

