మండలంలోని మునుగోడు, జమస్తాన్పల్లికి చెందిన 300మంది కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ కర్నాటి స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో జమస్తాన్‌పల్లి సర్పంచ్ పంతంగి పద్మ, ఉప సర్పంచ్ మంగదొడ్ల రాధ, నర్సింహ, వార్డు సభ్యులు ముంత ధనమ్మ, లక్ష్మయ్య, ముంత మారయ్య, ముత్తయ్య, పంతంగి స్వామి, ఎల్లయ్య, జాజుల శంకర్, పెద్ద అంజయ్య ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, పార్టీ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనంతవీణ, పట్టణాధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. మర్రిగూడ : మర్రిగూడ మండలంలోని రాజపేటతండా గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నున్సావత్ సక్కుబాయి మర్రిగూడలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సురేందర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శంకర్‌యాదవ్, బిచ్చునాయక్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో..
మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ రెండో వార్డు సభ్యుడు రమేశ్, కాంగ్రెస్‌కు చెందిన 20కుటుంబాల వారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుమలేశ్, ఎంపీటీసీ గడ్డం రాములమ్మ, వా ర్డు సభ్యులు గడ్డం నరేశ్, ఏసు, జిల్లా నాయకులు ప్రేమ్‌చందర్‌రెడ్డి, దశరథచారి, ముత్యాలు, కృష్ణయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో
మర్రిగూడ : మండలంలో కొండూరు గ్రామానికి చెందిన 10మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గ్రామశాఖ ఆద్వర్యంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆంబోతు లచ్చిరాం, తవిటి రామలు, ఆంబోతు ధర్మా, జరుపుల సుధాకర్, శంకర్, బీజేపీకి చెందిన బండి వెంకటయ్య, బడేటి శ్రీశైలం, ఎల్లంకి జంగయ్య, ముత్యాలు, లచ్చిరాంకు ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులు యాదవ్, సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, మాజీ సర్పంచులు అంజమ్మాఅంజయ్య, వల్లపు పర్వతాలు పాల్గొన్నారు.