నల్లగొండ రూరల్, నవంబర్ 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాల్లో భాగంగా గురువారం నల్లగొండ పట్టణంలోని అంజి కళాశాల ఎదుట బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామరాజు మాట్లాడుతూ,, బీసీ రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికైన బిజెపి ఎంపీలు బాధ్యత తీసుకుని 42 శాతం రిజర్వేషన్ల అములు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తండు సైదులు గౌడ్, సుంకరి మల్లేశ్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ కేశబోయిన శంకర్ ముదిరాజ్, బీసీ జేఏసీ కోఆర్డినేటర్ నేలపట్ల సత్యనారాయణ, బీసీ జేఏసీ కో చైర్మన్లు కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్య గౌడ్, చిక్కుళ్ల రాములు, జివాది ఇంద్రయ్య, పసుపులేటి సీతారాములు, గోకికార్ శంకర్, వాడపల్లి సాయిబాబా, బీసీ జేఏసీ ఆర్గనైజర్స్ గాంధారి వెంకటేశ్వర్లు, నల్ల సోమ మల్లన్న, సొల్లేటి రమేశ్, నాగులపల్లి శ్యాంసుందర్, గంజి భిక్షమయ్య నేత, జెల్లా ఆదినారాయణ, కుడదల ఎల్లం రాజు, నల్ల మధు యాదవ్,, చాగంటి రాములు, సింగారం మల్లయ్య ముదిరాజ్, బీసీ జేఏసీ గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ, కొల్లోజు సత్యనారాయణ, గుంటోజు గోవర్ధన చారి పాల్గొన్నారు.