నల్లగొండ, సెప్టెంబర్ 27: స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు కోర్టు విదించిన గడువు దగ్గర పడుతుండటంతో బీసీ రిజర్వేషన్లపై తర్జన భర్జన చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్-9తో రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు. జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉండగా వాటిల్లో జడ్పీ స్దానాలు జనరల్-4 కాగా జనరల్ మహిళ 4, బీసీ జనరల్-7, బీసీ మహిళ-7, ఎస్సీ జనరల్-3, ఎస్సీ మహిళ-3 స్దానాలకు రిజర్వ్ కాగా ఎస్టీ జనరల్-3, ఎస్టీ మహిళకు రెండు స్దానాలు రిజర్వ్ చేశారు. వీటీల్లో 16స్దానాలు మహిళలకు రిజర్వ్ చేయగా 17స్దానాలు ఆయా స్దానాల్లోని జనరల్ స్దానాలకు రిజర్వ్ చేశారు. ఇక ఎంపీపీల విషయానికి వస్తే….జనరల్ స్దానాలు-4రిజర్వ్ చేయగా జనరల్ మహిళకు-4, బీసీ జనరల్-7, బీసీ మహిళ-7, ఎస్సీ జనరల్-3, ఎస్సీ మహిళ-3స్దానాలకు రిజర్వ్ చేసిన అదికారులు ఎస్టీ జనరల్‌కు-4, ఎస్టీ మహిళకు ఒక స్దానం రిజర్వ్ చేశారు. మొత్తం ఎంపీపీల్లో 15స్దానాలు మహిళలకు, 18స్దానాలు జనరల్ స్దానాలకు రిజర్వ్ చేశారు. అయితే ప్రభుత్వం రిజర్వేషన్లు సైతం పూర్తి చేయటంతో ఎన్నికల సంఘం నేడో రేపో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే విదంగా జిల్లాలోని ఆయా మండలాల పరిదిలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సంబందించిన రిజర్వేషన్లు సైతం పంచాయితీరాజ్ యంత్రాంగం విడుదల చేసింది.