– నల్లగొండ జిల్లాలో ముగిసిన జిల్లా సైన్స్ ఫెయిర్
– రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఇన్స్పైర్ 11 ప్రాజెక్టులు
– జూనియర్, సీనియర్ విభాగంలో 14 ప్రాజెక్టులు
– విజేతలకు బహుమతులు అందచేసిన డీఈఓ, జిల్లా సైన్స్ అధికారి
రామగిరి, జనవరి 03 : సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా సైన్స్ ఫెయిర్ ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లా నుండి ఇన్స్పైర్ 11 ప్రాజెక్టులు, సైన్స్ ప్రదర్శనలో జూనియర్ 7, సీనియర్లో 7, టీచర్ ఎగ్జిబిట్లో ఆర్.సరస్వతి, జిహెచ్ఎం పుల్లెంల, సెమినార్లో జి.వినీలా జడ్సీహెచ్ఎస్ నకిరేకల్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ముగింపు వేడుకకు డీఈఓ బొల్లారం భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి హాజరై విజేతలకు బహుమతులు అందచేశారు. రాష్ట్ర స్థాయి ఎంపికైన ప్రాజెక్టులు ఈ నెల 7 నుండి 9 వరకు కామారెడ్డిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల విద్యార్థులు, గైడ్ టీచర్స్ పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతిని గానీ లేదా 9848578845 నంబర్లో సంప్రదించాలన్నారు.

Ramagiri : సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలి : డీఈఓ భిక్షపతి
ముగింపు సభలో జిల్లా పోలీసు కళాజాత, జిల్లా బాలభవన్ మాస్టర్ బాలు శిష్యులు, వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, ఎంఈఓలు బాలాజీనాయక్, అంజయ్య, అరుంధతి, జిల్లా గణిత ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అద్దంకి సునీల్, కొరివి కృష్ణ, ప్రభుత్వ బీఈడీ కళాశాల అధ్యాపకులు, బీఈడీ శిక్షణ విద్యార్థులు, సిబ్బంది, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
ప్రభుత్వ బీఈడీ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలలో ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన గదులతో పాటు ప్రదర్శనకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రభుత్వ బీఈడీ కళాశాల, బీఈడీ శిక్షణ విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. ఉపాధ్యాయ విద్యార్థి అంటేనే అన్ని రంగాల్లో ఉత్తమ సేవలు అందించాల్సి ఉంటుందని ఆ విషయం శిక్షణలోనే తెలుసుకోవడం అభినందనీయమన్నారు.

Ramagiri : సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలి : డీఈఓ భిక్షపతి

Ramagiri : సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలి : డీఈఓ భిక్షపతి