పెన్‌పహాడ్, మే 08 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ పరిధిలో గల రావిచెరువు నీరు అక్రమ తరలింపు ఆపాలని కోరుతూ చెరువుకింది రైతులు గురువారం తాసీల్దార్ లాలూనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొందరు ధనిక రైతులు చెరువుకు మోటార్లు వేసి వారి సొంత వ్యవసాయ క్షేత్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్వార్ధ పూరితంగా నీటిని తరలించుకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నట్లు, దీంతో చెరువు కింద ఉన్న చిన్న, సన్నకారు బోర్లు ఎండిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా మ్యాత్యకారులకు జీవన ఉపాధి లేకుండా పొయిందని, పశువులు నీటికి అల్లాడి ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తూముల ఇంద్రసేనారావు, సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రంగినేని లక్ష్మీకాంతారావు, రమేశ్, రంగినేని దామోదర్, వివేక్ పాల్గొన్నారు.