చందంపేట, అక్టోబర్ 10 : చందంపేట మండలంలోని గాజులపురం గ్రామంలో పలువురి రైతులకు సంబంధించిన భూములు అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాసీల్దార్ శ్రీధర్ బాబుకు బాధిత రైతులు వినతి పత్రం అందజేశారు. గాగిల్లాపురం గ్రామానికి చెందిన నక్క సంజీవ్ కుమార్ అదే గ్రామానికి చెందిన పలువురి రైతుల పేరిట ఉన్న సుమారు 20 ఎకరాల భూములను తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సాదా బైనామాలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో రైతులు రిజిస్ట్రేషన్ ఆపాలని కోరుతూ తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.