దేవరకొండ రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఖాయం అని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టోంగర్ ప్రతాప్ (చింటూ)కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మన అభ్యర్థులను గెలిపిస్తాయి అని అన్నారు.
రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన సూచించారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ విజయానికి దోహదపడాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సైదులు, తిరుపతయ్య, గుండాల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.