మురికి నీరు తాగేదెట్లా!
గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ మెయిన్ పం పులో నుంచి నాచు, బురద నీరు వస్తోందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
- కోదండాపురం మిషన్ భగీరథ మెయిన్ పంపులో నాచు, బురద
- 37 పంచాయతీలు, 14 ఆవాసాలకు నెల రోజులుగా అరకొరగా తాగునీటి సరఫరా
- పనితీరు మెరుగుపడకుంటే వాటర్ ప్లాంట్‌ను ముట్టడిస్తాం
- బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
గుడిపల్లి, మే 5: గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ మెయిన్ పం పులో నుంచి నాచు, బురద నీరు వస్తోందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఉమ్మడి పీఏపల్లి, గుడిపల్లి మండలాల్లోని 37 పంచాయతీలు 14 ఆవాసాలకు నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని తెలిసి మంగళవారం కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌లోని మెయిన్ పంపు హౌస్‌ను పరిశీలించగా నీరంతా నాచు, బురద, పురుగులతో నిండి ఉండడంతో ఆయన అక్కడి ఇన్చార్జిని పిలిచి ఇది జనం తాగే నీరేనా.. సంప్‌హౌస్‌ను ఎన్ని రోజులకోసారి కడుగుతారని ప్రశ్నించగా సదరు ఇన్చార్జి ఆరు నెలలకోసారి కడుగుతామని తెలిపారు.
అలాగే ఇక్కడ ఆరు ఫిల్టర్ బెడ్లకు గానూ కేవలం రెండు ఫిల్టర్ బెడ్లు మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో ఎక్కువ నీటిని అందించలేకపోతున్నామని తెలిపారు. కరెంటు ఉండకపోవడంతో నీటిని పంపింగ్ చేయలేకపోతున్నామన్నారు. దీంతో రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో బీఆర్ఎస్ బృందం మళ్లీ వస్తుందని, అధికారుల తీరు మారకపోతే వాటర్ ప్లాంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యల్గూరి వల్లపురెడ్డి, కేతావత్ బిల్యానాయక్, సర్పంచులు కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దూదిపాల అవ్విని రాజేందర్‌రెడ్డి, రాయినబోయిన శ్రీనయ్య, కేతావత్ కీరు, నేనావత్ కిషన్ నాయక్, నాయకులు నాగేశ్, అర్వపల్లి నర్సింహ, యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, సుధాకర్, కర్నాటి రవికుమార్, తోటకూరి పరమేష్, మద్దిమడుగు సుధీర్, నిమ్మల శివశంకర్‌రెడ్డి, గోలి గిరి, తాళ్ల విష్ణు, రమావత్ శ్రీనునాయక్, దామోదర్, లోకేశ్, వెంకటయ్య, రాములు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

