గుడిపల్లి, మే 5: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని, మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కోదండాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి, బస్తాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులను గురి చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి మ్యాచర్ వచ్చిన ధాన్యానికి కూడా బస్తాలు ఇవ్వడం లేదని, వారం నుంచి అధికారులు మ్యాచర్ చూడ టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తా తూకం 40 కేజీలకు బదులుగా 42 కేజీలకు వేస్తున్నారన్నారు.
కోదండాపురం గ్రామానికి చెందిన గొర్ల నాగేష్ గతనెల 24న 621 బస్తాలను 42 కేజీల చొప్పున తూకం వేసి లోడింగ్ చేసి అక్కంపల్లి సమీపలోని ఓ రైసు మిల్లుకు పంపగా అక్కడ 607 బస్తాలకు మాత్రమే ట్రాక్చిట్టీ ఇచ్చారన్నారు. మిల్లు యజమానులు రైతులకు ఇబ్బందులకు గురి చేయడం సబ బు కాదన్నారు. కోదండాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనకు వెళ్లిన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు య ల్గూరి వల్లపురెడ్డి, కేతావత్ బిల్యా నాయక్, సర్పంచులు కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దూదిపాల అశ్వినీ రాజేంద్రరెడ్డి, రాయిన బోయిన శ్రీనయ్య, ఆడెపు నాగేశ్, రమావత్ కిరు, రమావత్ కిషన్ నాయక్, అర్వపల్లి నర్సింహ, ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, కె.రవికుమార్, తో టకూరి పరమేశ్, మాద సుధాకర్, మద్దిమడుగు సుధీర్, నిమ్మల శివశంకర్‌రెడ్డి, గోలి గిరి, విష్ణు, శ్రీనూనాయక్, దామోదర్ నాయక్, లోకేశ్ నాయక్ ఉన్నారు.