– అఖిలపక్ష పార్టీలు
రామన్నపేట, ఏప్రిల్ 10 : గతంలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గంను పునరుద్ధరించాలని, నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మండల అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక రహదారి బంగళాలో అఖిలపక్ష పార్టీల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య,కాంగ్రెస్ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం మాట్లాడుతూ సుమారుగా 50 సంవత్సరాలు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గం 2009వ సంవత్సరంలో రద్దు చేయడంతో 20 సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగిందని మండల కేంద్రమైన రామన్నపేటలో డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయని నియోజకవర్గ కావడానికి ఉన్న సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయన్నారు.
నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఈ పోరాటంలో రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలునిచ్చారు. మరో మహా పోరాటానికి గ్రామాల ప్రజలు సన్నద్ధం కావాలని త్వరలో పోరాట కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కన్నెకంటి వెంకటేశ్వర చారి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బీఆర్ఎస్ మండల బత్తుల వెంకటేశం,బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ మజీద్, కార్యదర్శి యాదాసు యాదయ్య, జినుకల ప్రభాకర్,సాల్వేరు అశోక్, కూరెళ్ళ నర్సింహా చారి, ఎండీ జమీరొద్దీన్, గోదాసు పృద్వి, నోముల చిరంజీవి, బొడ్డు సురేందర్, తిరుగుడు మల్లికార్జున్, ఎండీ రెహాన్, కందుల హనుమంతు, బోయిని ఆనంద్, బొడ్డు వెంకటేశం పాల్గొన్నారు.