నల్లగొండ రూరల్, జనవరి 11 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం కూడారై ఉత్సవాలను అత్యంతవైభవంగా నిర్వహించారు. 108 ఇత్తడి, 54 వెండి గంగాళాల్లో పాయసాన్ని గోదా రంగనాథ స్వామికి నివేదించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఆలయ చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు, యాట జయప్రద, వేదాంతం శ్రీనివాసా చార్యులు, లక్ష్మీనారాయణ, పాదం ప్రియాంక, హనుమంతు, మిరియాల స్వామి, జయరామయ్య, కొండ శివశంకర్, చకిలం సంధ్యారాణి, వెంకటాచార్యులు, రామ రంగాచార్యులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలోని సీతారామచంధ్రస్వామి ఆలయంలో కుడారై ఉత్సవాలను నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శేషం నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, చామల వాణీవెంకటరమణారెడ్డి, శ్రీకర్‌రెడ్డి, శాలిని పాల్గొన్నారు.
మిర్యాలగూడ : స్థానిక హౌసింగ్‌బోర్డు వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కుడారై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గోదారంగనాథ స్వామికి 1,116 గెన్నెలలో పాయసాన్ని నివేదన చేశారు. భక్తులు తిరుప్పావై 27వ పాశురాన్ని పఠించారు. అర్చకుడు రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సూదిని వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నూరి వేణుగోపాల్‌రావు, బాధ్యులు కాసుల సత్యం, రమాదేవి, ఉపేందర్ పాల్గొన్నారు.
సూర్యాపేటలో ప్రత్యేక పూజలు
బొడ్రాయిబజార్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం కూడారై పాయస నివేదనను ఆలయ ప్రధానార్చకుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణాశ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వై. శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు శ్రీహరి, ఫనికుమార్, హరిచరణ్, విష్ణువర్ధనాచార్యులు, బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్, మాధవరావు, కరుణాసాగర్‌రెడ్డి, దంతాల నాగరాజు, శ్రీనివాస్, శేఖర్, రమేశ్, ఊర గాయత్రి పాల్గొన్నారు.
తుంగతుర్తి : స్థానిక పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలతో అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించారు. కార్యక్రమంలో పోలవరపు సరస్వతి, ఓరుగంటి సుశీల, శ్రవంతి, బండారు విజయ, కవిత, సూర్యకళ పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయంతో పాటు మండలంలోని రామాపురం, రేవూరు, కందిబండ గ్రామాల్లోని వైష్ణవ ఆలయాల్లో కూడారై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వేంకటేశ్వరుడికి 108 గంగాళాలతో పాయసం నైవేద్యం సమర్పించారు. అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, సుదర్శనం ప్రసాదాచార్యులు, మోహనకృష్ణమాచార్యులు, వరప్రసాదాచార్యులు, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, భానుకిరణ్శర్మ పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో కుడారై ఉత్సవాన్ని అర్చకులు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ తెలిపారు. గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం, విశేష అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు బదిరీనారాయణచార్యులు, నరసింహాచార్యులు పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని పొనుగోడు గ్రామంలో గల వేణుగోపాల స్వామి, గరిడేపల్లి, కల్మల్చెర్వు గ్రామాల్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడారై ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా ఆలయ కమిటీల సభ్యులు, అర్చకులు, మహిళలు పాల్గొన్నారు.
కోదాడ టౌన్ : పట్టణంలోని గుంటి రఘునాథ స్వామి ఆలయంలో గోదాదేవికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 108 వెండి గిన్నెల్లో పాయసాన్ని చేసి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో భక్తమండలి మహిళా సభ్యురాలు సుష్మా, శ్రీదేవి, లీలాదేవి, పద్మావతి, లక్ష్మి, రంగారావు, నరసింహరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.