నల్లగొండ, ఆగస్టు 08 : శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో నల్లగొండ పట్టణంలోని స్వీట్ షాపులు, రాఖీ దుకాణాలు శుక్రవారం సందడిగా మారాయి. మహిళలు, యువతులు తమ సోదరుల కోసం రాఖీలు, నోరూరించే స్వీట్లు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. రక్షా బంధన్ పండుగ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, నోరు తీపి చేసే ఆనవాయితీ తెలిసిందే. దీంతో స్వీట్, రాఖీ దుకాణాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వ్యాపారాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Nalgonda : సందడిగా రాఖీ దుకాణాలు, స్వీట్ షాపులు
Nalgonda : సందడిగా రాఖీ దుకాణాలు, స్వీట్ షాపులు