Under water tunnel | దేశంలో మొదటి అండర్‌వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్.. అసోంలో నిర్మించనున్న కేంద్రం
underwater tunnel : దేశంలో మొదటిసారి అండర్ వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్ అసోంలో నిర్మాణం కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Under water tunnel : దేశంలో మొదటిసారి అండర్ వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్ నిర్మాణం కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అసోంలో చేపట్టనున్న అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కం రైల్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు రూ.18,662 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అంగీకరించింది. త్వరలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై గోపూర్-నుమాలిఘడ్ మధ్య ఈ ప్రాజెక్టు చేపడుతారు.
ఈ ప్రాజెక్టు ప్రధానంగా అసోం ప్రగతితోపాటు ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడనుందని కేంద్రం తెలిపింది. రవాణా ఖర్చులు తగ్గడం, వేగవంతమవడం, సామాజిక-ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్లో దీన్ని నిర్మిస్తారు. ఇది ఎన్‌హెచ్15, ఎన్‌హెచ్ 715 మధ్య 33.7 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ ప్రాజెక్టు నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లను, అలాగే రెండు ప్రధాన ఎయిర్‌పోర్టులను, రెండు జల రవాణా మార్గాలను కలుపుతుంది. ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా సగటున ఒక వ్యక్తికి 80 లక్షల రోజులపాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దొరుకుతుంది.
ఈ ప్రాంతాల పరిధిలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకునేందుకు దోహదపడుతుంది. దీనిలో రెండు వేర్వేరు టన్నెల్స్ ఉంటాయి. ఒకటి రోడ్డు రవాణా కోసం. ఇంకోటి రైళ్ల కోసం. మొత్తం నాలుగు లేన్లుగా నిర్మాణం చేపడతారు. అలాగే దీని నిర్మాణం పూర్తైతే గోపూర్-నుమాలిఘడ్ మధ్య రవాణాకు దూరం 240 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే.. ఆరు గంటల ప్రయాణానికి 20 నిమిషాలే పడుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

