నిడమనూరు, జూలై 14 : నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకం ద్వారా నిరుద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటివరకు నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకానికి తక్షణమే నిధులు కేటాయించి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జిల్లా నాయకులు మల్లికంటి చంద్రశేఖర్, ధర్మారపు మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు.