Rajapeta | రాజాపేట, మే 23 : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర్ర జేస్తే నియోజకవర్గంలో ఐలయ్య తిరగలేడని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత ఐలయ్యకు లేదన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సట్టు తిరుమలేశ్ మాట్లాడారు.
ఎన్నికల సమయంలో చేతకానీ హామీలు గుప్పించి, ఇప్పుడు అమలు చేయమని అడిగితే ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు గమనిస్తురన్నారు. అడ్డమైన భాషతో, నాలుకకే అసహ్యం వేసే బూతులు మాట్లాడడం సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు గత 18 నెలలుగా పరేషాన్ అవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు తమ నోటిని హార్పిక్తో కడిగిన తప్పు లేదని, రేవంత్ రెడ్డి తిట్ల దండకం చదువుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవిష్యత్తు ఎన్నికల్లో ఫెయిల్ అవ్వడం ఖాయమన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడం కాదు.. నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అందాల పోటీలు కాదు అన్నదాతల ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలి. ప్రచారాలు కాదు ప్రజలకు మేలు జరిగేలా పనులు చేయాలనే ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఇకనైనా తీరు మార్చుకొని రానున్న మూడేండ్లలో ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు.